స్లోవెనియాలో మంచు విష్ణు, లావణ్య త్రిపాటి తమ తదుపరి సినిమా ‘దూసుకెళ్తా’ చిత్రీకరణలో బిజీగావుంది. స్లోవెనియా రాజధాని ల్జుబ్లిజానలో ఒక మాస్ పాట చిత్రీకరణ జరుగుతుంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. “యూరప్‌లో ల్జుబ్లిజాన అనే అందమైన ప్రదేశంలో వున్నాం. మేము తీస్తున్న ఈ మాస్ సాంగ్ బాగా రావాలని కొరుకోండి. ఇదే నా మొదటి మాస్ సాంగ్”అని లావణ్య తన పేజిలో పోస్ట్ చేసింది. ఇదిలావుంటే మన ప్రేమ్ రక్షిత్ నృత్యభంగిమలు విష్ణుని కష్టపెడుతున్నయట. దీని గురించి మాట్లాడుతూ “నేను ప్రేమ్ రక్షిత్ ను దాదాపు ద్వేషించే స్తితిలో వున్నాను. అతని షూటింగ్ అయ్యాక సాయంత్రం నడవడానికి కూడా ఇబ్బందిపడుతున్నానని”చెప్పాడు. వీరూ పొట్ల ఈ సినిమాకు దర్శకుడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాను మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ మరియు తిరుపతిలో జరుగుతుంది.