దూసుకెళ్తాతో దూసుకెళ్తానంటున్న మంచు విష్ణు

దూసుకెళ్తాతో దూసుకెళ్తానంటున్న మంచు విష్ణు

Published on Aug 10, 2013 11:40 PM IST

Doosukelta
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘దూసుకెళ్తా’ సినిమా ప్రస్తుతం నిర్మాణదశలోవుంది. ‘దేనికైనా రెడీ’ విజయం తరువాత విష్ణు నుండి వస్తున్న తదుపరి చిత్రం కనుక ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజే విడుదలైంది. కామెడీ , ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాను వీరూ పొట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అందాల రాక్షసి’ సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య ఈ సినిమాలో హీరోయిన్. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు

‘దూసుకెళ్తా’ సినిమాను 24ఫ్రేమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ‘దేనికైనా రెడీ’ సినిమా తరువాత మరోసారి ఈ సినిమాతో అతనిని విజయలక్ష్మి వరిస్తుందని ఆశిద్దాం

తాజా వార్తలు