ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకుంటాయని ప్రేక్షకులు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే ఈ బ్యానర్ వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇక తాజాగా ఈ బ్యానర్ ఓ సరికొత్త రొమాంటిక్ చిత్రాన్ని అందించేందుకు సిద్ధమైంది. అశోక్ గల్లా, శ్రీగౌరి ప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘VISA – వింటారా సరదాగా’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వారు తాజాగా రిలీజ్ చేశారు. రాహుల్ విజయ్, శివాత్మిక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఉద్భవ్ డైరెక్ట్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్ర టీజర్‌ను జూలై 12న ఉదయం 10.53 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా టీజర్ ఎలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.