ప్రస్తుత భారత జట్టు సారధి విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క శర్మలు వివాహ అనంతం ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని నడుపుతున్నారు. ఒకపక్క తమ వృత్తులు చేసుకుంటూనే సాఫీగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి జంటా ముగ్గురు కానున్నారు.
వచ్చే 2021 లో తాము ఇద్దరమూ ముగ్గురు కాబోతున్నామని విరాట్ తన సోషల్ మీడియా ద్వారా అనుష్క శర్మ గర్భవతి అయ్యినట్టుగా తెలిపారు. దీనితో అప్పుడే సోషల్ మీడియాలో వారి అభిమానులు శుభాభివందనాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇపుడు ఈ జంట దుబాయ్ లోని ఐపీఎల్ నిమిత్తం వెళ్లి ఉంటున్నారు. అక్కడ నుంచే విరాట్ ఈ ఆనందకర విషయాన్ని తెలిపి ఇద్దరి అభిమానులను సంతోషపరిచారు. ఇటీవలే అనుష్క శర్మ నిర్మించిన పలు వెబ్ సిరీస్ లు మన దగ్గర విడుదలైన సంగతి తెలిసిందే.