మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ మహేష్ బాబు ఇద్దరూ ఇద్దరే. వీరి సినిమాల రికార్డులు రీజనల్ మార్కెట్ లో మాత్రం మామూలు లెవెల్లో ఉండవు. అయితే పాన్ ఇండియా మార్కెట్ లోకి లేట్ గానే ఎంట్రీ ఇచ్చిన వీరి నడుమ ఓ మల్టీస్టారర్ అంటే ఆ సౌండింగ్ కే ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఇలా ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించినా ఒకరికోసం ఒకరు మాట్లాడినా మరింత స్పెషల్ గా మారుతుంది.
మరి ఇద్దరి సినిమాలు థియేటర్స్ లో ఒకేసారి రావడం అరుదే కానీ థియేటర్స్ దగ్గర ఇద్దరి కటౌట్స్ మాత్రం ఇపుడు ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు రీరిలీజ్ కి వస్తుండగా ఆ సినిమా నుంచి మహేష్ కటౌట్ ఇంకో పక్క హరిహర వీరమల్లు పై పవన్ కళ్యాణ్ కటౌట్ లు పక్క పక్కనే ఓ థియేటర్ దగ్గర దర్శనమిచ్చాయి. దీనితో ఈ క్రేజీ పిక్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ మంచి వైరల్ గా మారింది.