ఆగస్ట్ లో తాండవం

ఆగస్ట్ లో తాండవం

Published on May 13, 2012 9:25 PM IST


విక్రమ్,అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “తాండవం” ఆగష్టు లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగపతి బాబు మరియు ఏమి జాక్సన్ లో ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం లండన్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ వారం మొదట్లో ఏమి జాక్సన్ తన పాత్రను పూర్తి చేసుకుంది. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యుటివి మోషన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ఒకేసారి నిర్మిస్తున్నారు ఏ ఎల్ విజయ్ గతంలో “మదరాసిపట్టణం” మరియు “నాన్న” చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్ర చిత్రీకరణను జూన్ 12లొపు ముగించేయాలని దర్శకుడు అనుకుంటున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదల కానుంది. ఈ చిత్రం యాక్షన్ చిత్రంగా ఉండబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు