విక్రమ్ ,అనుష్కల చిత్రానికి “శివ తాండవం” పేరు ఖరారు

విక్రమ్ ,అనుష్కల చిత్రానికి “శివ తాండవం” పేరు ఖరారు

Published on Jul 10, 2012 11:41 PM IST


విక్రమ్,అనుష్క మరియు జగపతి బాబు రాబోతున్న ద్విభాషా చిత్రానికి “శివ తాండవం” అనే పేరుని ఖరారు చేశారు.ఏ ఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా యు టి వి మోషన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తమిళ వెర్షన్ కి “తాండవం” అనే పేరు ఖరారు అయ్యింది. ఈ మధ్యనే ఈ చిత్రం చిత్రీకరణ చెన్నైలో ముగించుకుంది. ఈ చిత్రం చాలా భాగం వరకు చెన్నై,ఢిల్లీ మరియు లండన్ లలో చిత్రీకరణ జరుపుకుంది. ఏమి జాక్సన్ మరియు లక్ష్మి రాయి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జూలై 13న ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఆవిష్కరిస్తారని యూటివి దక్షణ హెడ్ ధనంజయ్ గౌడ్ చెప్పారు. విక్రమ్,జగపతి బాబు , ఏమి జాక్సన్, లక్ష్మి రాయి మరియు ఏ ఎల్ విజయ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించగా ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుంది.

తాజా వార్తలు