2020లో తెలుగు పరిశ్రమకు ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల రూపంలో సూపర్ స్టార్ట్ దొరికింది. ఈ రెండు సినిమాలు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ శుభారంభంతో ఇకపై అన్ని సినిమాలు ఇలాగే విజయాల్ని సాధించాలని అంతా అనుకున్నారు. కానీ ఆ విజయోత్సాహానికి ఆ రెండు సినిమాల దగ్గరే కామా పడింది.
ఆ చిత్రాల తర్వాత విడుదలైన చెప్పుకోదగిన సినిమాలు ఏవీ క్లీన్ హిట్ అనిపించుకోలేకపోయాయి. కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ జస్ట్ ఓకే రిపోర్ట్స్ తెచ్చుకోగా ఆ తర్వాత వచ్చిన ‘డిస్కో రాజా’ పరాజయం చెందింది. ఇక నాగ శౌర్య ‘అశ్వధ్ధామ’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక సమంత, శర్వాల ‘జాను’కు టాక్ అయితే బాగుంది కానీ కలెక్షన్స్ లేవు. మధ్యలో వచ్చిన ‘సవారి, చూసీ చూడంగానే’ లాంటి చిన్న సినిమాల సంగతి సరేసరి.
ఇలా వరుస ఫ్లాపుల తర్వాత ఈ నెల 14న విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విడుదలకానుంది. మంచి బుజ్ నడుమ వస్తున్న ఈ చిత్రమైన ఈ వరుస ఫ్లాప్‌లకు ఫులుస్టాప్ పెట్టి ‘సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో’ చిత్రాలు అందించిన విజయ స్పూరిని కొనసాగిస్తుందేమో చూడాలి.