విజయ్ ‘మాస్టర్’ కూడా వెనక్కి వెళ్లక తప్పదా ?

విజయ్ ‘మాస్టర్’ కూడా వెనక్కి వెళ్లక తప్పదా ?

Published on Mar 18, 2020 11:00 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్, తెలుగు రాష్ట్రాల్లో కూడా తన మార్కెట్‌ ను పెంచుకోవటానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే విజయ్ గత సినిమా ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’గా వచ్చి ఇక్కడ మంచి కలెక్షన్స్ ను రాబట్టి, విజయ్ కు మాస్ ప్రేక్షకులలో మంచి అభిమానులను సంపాదించి పెట్టింది దాంతో విజయ్ కొత్త సినిమా ‘మాస్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్‌ ఏర్పడింది.

అయితే మొదట ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ, దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రమాదకరమైన కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని తమిళ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రం విడుదలను మే నెలకు పోస్ట్ పోన్ చేయాలని విజయ్ అండ్ అతని టీమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపిస్తారట. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు