కోలీవుడ్ టాలెంటెడ్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నిత్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే “తలైవన్ తలవి”. తమిళ నాట సూపర్ హిట్ అయ్యిన ఈ సినిమా తెలుగులో “సార్ మేడం” గా రిలీజ్ అయ్యి మన దగ్గర డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇలా థియేటర్స్ లో మంచి వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.
ఈ సినిమా ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా ఇందులో తెలుగు, తమిళ్ సహా టోటల్ పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది. అన్నట్టు ఈ సినిమా ఆగస్టు 22 నుంచి అందుబాటులోకి రానుంది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో ట్రై చేయవచ్చు.