పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇక ఈ సినిమా తర్వాత ఓజి సీక్వెల్ తాను ఓకే చేశారు. మరి ఈ సినిమా కాకుండా దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ సినిమా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఆ సినిమా విషయంలోనే ఓ క్రేజీ రూమర్ ఇపుడు మొదలైంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మార్చిన కొత్త లుక్ అభిమానుల దృష్టి ఆకర్షించింది.
హెయిర్ కట్ చేయించి లైట్ గడ్డంతో జుబ్బా లాంటివి కాకుండా బయట కూడా స్టైలిష్ లుక్స్ తో తాను కనిపించడం వైరల్ గా మారింది. కానీ ఇది అంతా తన నెక్స్ట్ సినిమా కోసమే అన్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది. తన నెక్స్ట్ సినిమాలో పవన్ ఒక మిలట్రీ ఆఫీసర్ గా కనిపించనున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. లేదా లుక్ మార్చడం పవన్ గెటప్స్ ఒకే మీటర్ లో సింక్ కావడంతో అలా కనెక్ట్ చేసేసారా అనేది మున్ముందు క్లారిటీ వస్తుంది.


