సమీక్ష: విజయ్ సేతుపతి ‘ఏస్’ – బోర్ గా సాగే సిల్లీ డ్రామా

సమీక్ష: విజయ్ సేతుపతి ‘ఏస్’ – బోర్ గా సాగే సిల్లీ డ్రామా

Published on May 23, 2025 5:05 PM IST

విడుదల తేదీ : మే 23, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్, యోగి బాబు, బబ్లూ పృథ్వీరాజ్, బి. ఎస్. అవినాష్, దివ్య పిళ్లై తదితరులు
దర్శకుడు : ఆఱుముగ కుమార్
నిర్మాణం: ఆఱుముగ కుమార్
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ & సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ : కరణ్ బి. రావత్
ఎడిటర్ : ఫెన్నీ ఆలివర్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏస్’ కూడా ఒకటి. తమిళ్ సహా తెలుగులో కూడా నేడే విడుదల అయ్యిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

మలేషియాలో పని చేసుకొని బతకడానికి వెళ్లిన బోల్ట్ కాశీ అక్కడ జ్యానం (యోగిబాబు) సాయంతో చేరేందుకు వస్తాడు. అయితే ఆర్ధికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్న రుక్మిణి (రుక్మిణి వసంత్) అనే అమ్మాయి పరిచయంతో ఆమె ఇబ్బందులు చూసి బోల్ట్ ఆమెకి సాయం చెయ్యాలని అనుకుంటాడు. కానీ ఈ క్రమంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి పేకాటలోకి దిగుతాడు. మరి అక్కడ ఒక గ్యాంగ్స్టర్ ధర్మ (బిఎస్ అవినాష్) తో ఆడి పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోతాడు. దీనితో ఆ మొత్తాన్ని కూడా వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఊహించని సమస్యలు తన నెత్తిన పెట్టుకున్న బోల్ట్ నెక్స్ట్ తీసుకున్న స్టెప్ ఏంటి? ఆమెకి చేస్తానన్న సాయం చేశాడా లేదా? అలాగే ధర్మ ఏం చేసాడు? ఈ అంతటిలో రాజ దొరై (బబ్లు పృథ్వీరాజ్) పాత్ర ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

విజయ్ సేతుపతి ఎలాంటి నటుడు అనేది అందరికీ తెలిసిందే. అలా తనలో కనిపించే పలు షేడ్స్ లో తన నెమ్మదితనం నటన సింపుల్ ఎక్స్ ప్రెషన్స్ తో చూపించే భావోద్వేగాలు కూడా ఉంటాయి. మరి ఈ వెర్షన్ తో విజయ్ సేతుపతి ఈ సినిమాలో అలరించారు అని చెప్పవచ్చు. కొన్ని కీలక సన్నివేశాలని కూడా తన మార్క్ ఈజ్ నటనతో అలవోకగా చేసేస్ వెర్సటాలిటీ తాను చూపించారు.

ఇక తనతో పాటుగా సినిమాలో కొంచెం రిలీఫ్ గా అనిపించేది యోగిబాబు సన్నివేశాలు ఉన్నపుడు అని చెప్పవచ్చు. తన వన్ లైనర్ ఫన్ డైలాగ్స్ మంచి ఫన్ ని జెనరేట్ చేసి నవ్విస్తాయి. అలాగే రుక్మిణి వసంత్ కూడా ఆమ్ రోల్ లో బాగుంది. అలాగే ఇతర సపోర్టింగ్ నటీనటులు బబ్లు పృథ్వీరాజ్ అలాగే విలన్ బిఎస్ అవినాష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో మేజర్ డిజప్పాయింటింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అది సినిమా కథ, కథనాలే అని చెప్పాలి. అసలు లైన్ నే రొటీన్ అనుకుంటే దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం మరింత రొటీన్ గా ఉంటుంది. దీనితో చాలా వరకు సినిమా చాలా బోరింగ్ గా ఊహాజనితంగానే కొనసాగుతుంది.

ఎలాంటి ట్విట్ లు టర్నింగ్ లు లేకుండా ఈ చిత్రం చప్పగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కామెడీ, క్రైమ్ ఇంకా రొమాంటిక్ అంశాలు కనిపిస్తాయి కానీ ఏది కూడా కంప్లీట్ గా ఆడియెన్స్ కి అనిపించుడు. అంతా ఏదో సగం వండి వార్చిన అన్నంలా అనిపిస్తుంది. అలాగే విజయ్ సేతుపతి నటన బాగానే ఉంది కానీ తన పాత్ర మాత్రం అంత ఎఫెక్టీవ్ గా సినిమాలో లేదు.

రుక్మిణి పాత్ర కూడా అంతే వీరి రోల్స్ ని సరిగ్గా డెవలప్ చేయలేదు. అలాగే కొంత సమయం తర్వాత యోగిబాబు కామెడీ కూడా తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా అన్ని అంశాల్లో కూడా సినిమా నిరుత్సాహంగానే సాగుతుంది. ఇక వీటితో పాటుగా ఆ పాటలు కూడా బాలేవు. సరైన ఎమోషన్స్ వంటివి కూడా చిత్రంలో లేవు. ఇలా సినిమాలో మెప్పించే అంశాలు కంటే నొప్పించే అంశాలే చాలా ఎక్కువగా కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. జస్టిన్ ప్రభాకరన్, సామ్ సి ఎస్ ల సంగీతం అంతగా వర్కౌట్ కాలేదు. కరణ్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ బాలేదు. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఇక దర్శకుడు అఱుముగ విషయానికి వస్తే తన వర్క్ ఈ సినిమాకి మెప్పించలేదు అని చెప్పక తప్పదు. తాను తీసుకున్నదే చాలా రొటీన్ కథ అయితే దానిని అంతకంటే డల్ గా తెరకెక్కించడం ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. మెయిన్ గా స్క్రీన్ ప్లే మీద తాను ఫోకస్ చేయాల్సింది. వీటితో తన వర్క్ డిజప్పాయింట్ చేస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఏస్’ చిత్రం ఒక రొటీన్ అండ్ బోరింగ్ డ్రామా అని చెప్పాలి. నటన పరంగా మెయిన్ లీడ్ ఓకే కానీ అసలు సినిమాలో పస లేదు. కథ, కథనాలు చాలా రొటీన్ అండ్ బోరింగ్ గా సాగాయి. ఎక్కడో ఒకటీ రెండు సీన్స్ తప్పితే ఈ చిత్రంలో చూసేందుకు మంచి అంశాలు పెద్దగా లేవు. సో ఈ వీకెండ్ కి మరో ఆప్షన్ ఎంచుకోండి.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు