రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ భారీ క్లైమాక్స్ పూర్తి.. టీజర్ వచ్చేస్తుంది!

రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ భారీ క్లైమాక్స్ పూర్తి.. టీజర్ వచ్చేస్తుంది!

Published on Jun 7, 2025 12:00 PM IST

మన తెలుగు సినిమాలో ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే వినిపించే గొంతు సుమ కనకాలదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 90 శాతం తన యాంకరింగ్ లేని సినిమాలు ఉండవు. మరి సుమ, రాజీవ్ కనకాల వారసుడు యంగ్ హీరో రోషన్ కనకాల తన తొలి చిత్రం బబుల్ గమ్‌లో తన అద్భుతమైన నటనతో అలరించిన ప్రస్తుతం ‘మోగ్లీ 2025’లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ మారేడుమిల్లిలో బిగ్ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి చేశారు. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌ లో మ్యాసీవ్ యాక్షన్ సీక్వెన్సలని షూట్ చేశారు. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో రోషన్ కనకాల చాలా రిస్క్ తీసుకుని యాక్షన్ స్టంట్స్ ని పెర్ఫార్మ్ చేశారు. ఈ సీన్స్ సినిమాలో మేజర్ హైలెట్ గా వుండబోతున్నాయి. మారేడుమిల్లిలో మూడో షెడ్యూల్‌ పూర్తి చేశారు. ఇంకొక్క షెడ్యూల్‌ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ నెలలోనే టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ‘మోగ్లీ’ ఆల్బమ్, బ్యాగ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్ గా ఉండబోతుంది. ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.

ఈ చిత్రంతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కిరణ్ మామిడి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తుండగా, నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రాఫర్ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లేను రామ మారుతి ఎం, రాధాకృష్ణ రెడ్డి రాశారు. ఇక ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది చివరలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు