తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇటీవల కరూర్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించాడు. అయితే, ఈ ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే, ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విజయ్ ఈ ప్రమాదంపై స్పందించాడు.
కరూర్‌లో జరిగిన తొక్కిసలాట తనను ఎంతగానో బాధించిందని.. ఇలాంటి దురదృష్టకరమైన ఘటన జరగకుండా ఉండాల్సిందని.. అభిమానులు తనను నేరుగా చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.. వారి ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. అయితే, ఇలాంటి బాధాకరమైన పరిస్థితి తన జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదని.. త్వరలోనే కరూర్ బాధితులను పరామర్శిస్తానని ఆయన అన్నారు.
ఈ ఘటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని.. నిజాలు నెమ్మదిగా బయటకు వస్తాయని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.