నాని డైరెక్టర్ తో దేవరకొండ మూవీ కన్ఫర్మ్ చేసినట్టేనా?

నిన్న హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకొని టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వారిలో దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కూడా ఉన్నారు. ‘హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ, ఈ ఏడాది నీ నుండి మంచి మూవీ ఇంకా రావాల్సివుంది. నువ్వు చేసే అద్భుతాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా విజయ్ దేవరకొండ ‘కృతజ్ఞతలు.. ఐతే ఆ అద్భుతం మనమిద్దరం కలిసి చేయబోతున్నాం’ అని ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ ట్వీట్.. వీరిద్దరూ త్వరలో సినిమా చేయబోతున్నట్లు చెప్పకనే చెవుతుంది అనిపిస్తుంది.

గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ రానుంది అంటూ వార్తలు రాగా, దానికి నేడు విజయ్ దేవరకొండ హింట్ ఇచ్చినట్లైంది. ప్రస్తుతం విజయ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తో పాన్ ఇండియా మూవీ చేస్తుండగా, దర్శకుడు మోహన కృష్ణ నాని తో వి మూవీ తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వి విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి నెలలో ఉగాది కానుకగా విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

Exit mobile version