పిక్ టాక్ : సరికొత్త లుక్‌లో మెస్మరైజ్ చేస్తున్న విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘కింగ్డమ్’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా ఇందులో విజయ్ లుక్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌లో చూశాం. ఇక ఆ లుక్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాడు ఈ క్రేజీ హీరో.

అయితే, తాజాగా ఆయన సరికొత్త లుక్‌తో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా జరిగిన ‘దిల్ రాజు డ్రీమ్స్’ లాంచ్ వేడుకలో విజయ్ దేవరకొండ సందడి చేశాడు. ఈ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన ఆయన గడ్డం తీసేసి మ్యాచో స్టైల్ మీసంతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ లుక్ అభిమానుల్లో బాగా వైరల్ అవుతుంది.

ఈ వేడుకలో విజయ్ లుక్స్ హైలైట్‌గా కనిపించడంతో అభిమానులు ఆయనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

Exit mobile version