హీరో సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా !’ చిత్రం ఈమధ్యే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. సినిమా విమర్శకులు, ప్రేక్షకులు, సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. సినిమాను, హీరో సూర్య నటనను, దర్శకత్వాన్ని ఆకాశానికెత్తేశారు. తన స్నేహితులతో కలిసి సినిమాను చూశానన్న విజయ్ అందులో ముగ్గురు స్నేహితులు ఏడ్చేశారు అంటూ చెప్పుకొచ్చారు. సినిమా చూశాక ఆవేశం వచ్చింది. సూర్య అన్న అద్భుతమైన నటుడు.
ఆయన నటనను చూసి అందరూ ప్రేమలో పడిపోతారు. ఈ సినిమాని ఆయన నిర్మించినందుకు లవ్ యు సార్. అపర్ణ బాల మురళీని ఎక్కడి నుండి తీసుకొచ్చారో కానీ సినిమా మీద పూర్తి కమాండ్ చూపించింది. సుధా కొంగరగారు త్వరలో మీతో వర్క్ చేస్తాను. జీవీ ప్రకాశ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఇతర నటీనటులు అందరూ చాలా గొప్పగా చేశారు.
ఈ కథలో ఎంత వాస్తవమో, ఎంత ఫిక్షనో తెలియదు కానీ సింప్లి ఫ్లై పుస్తకం కొని చదవాలని అనుకుంటున్నాను. ఈ సినిమా తప్పక చూడవలసిన సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.