విజయ్ దేవరకొండ సాయంలో కూడా ప్రత్యేకం..!

విజయ్ దేవరకొండ సాయంలో కూడా ప్రత్యేకం..!

Published on Apr 26, 2020 11:01 AM IST

హీరో విజయ్ దేవరకొండ కరోనా క్రైసిస్ సందర్భంగా ఏర్పడిన దుర్భర పరిస్థితులను ఎదుర్కోవడానికి సామాన్యులకు చేయూతనివ్వడానికి ముందు కొచ్చారు. దీనికోసం ఆయన రెండు చారిటీ సంస్థలను ఏర్పాటు చేశారు. ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్(టి డి ఎఫ్), మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎం సి ఎఫ్) అనే రెండు ఛారిటీ విభాగాలను స్టార్ట్ చేశారు. ఒక కోటి రూపాయలతో మొదలైన టి డి ఎఫ్ ఫౌండేషన్ తరపున కొందరు విద్యార్థులను ఎంపిక చేసిన వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతారట. దేవరకొండ జీవితంలో కనీసం ఒక లక్ష మందికి ఉద్యోగులను తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.

అలాగే ఈ క్రైసిస్ సమయంలో నిత్యావసరాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న వారికోసం మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేశారు. 25లక్షల రూపాయలతో ఏర్పాటైన ఈ ఫౌండేషన్ ముఖ్య ద్యేయం కనీస అవసరాలు తీర్చుకోలేక అవస్థలు పడుతున్నవారి కోసం. https://thedeverakondafoundation.org లాగిన్ అయి తమ డిటైల్స్ నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారట. కనీసం ఈ 25లక్షలతో 2000 కుటుంబాల అవసరాలు తీర్చాలని లక్ష్యం పెట్టుకున్నారట.

తాజా వార్తలు