అటు తమిళ్ సహా మన తెలుగులో కూడా భారీ హిట్ అయ్యిన కోలీవుడ్ చిత్రాల్లో విజయ్ ఆంటోనీ నటించిన భారీ హిట్ చిత్రం “బిచ్చగాడు” కూడా ఒకటి. ఫస్ట్ పార్ట్ తెలుగులో పెద్ద సక్సెస్ అయ్యింది. దీంతో పార్ట్ 2 కి ఏకంగా తమిళ్ కంటే మన తెలుగులోనే ఎక్కువ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. మరి ఇలా బిచ్చగాడు సిరీస్ కి మంచి క్రేజ్ మన దగ్గర నెలకొంది.
అయితే విజయ్ ఆంటోనీ పార్ట్ 3 కూడా ఉంటుంది అని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా లేటెస్ట్ గా తన మార్గన్ ప్రమోషన్స్ లో బిచ్చగాడు 3 ఎప్పుడు అనేది కన్ఫర్మ్ చేశారు. తానే దర్శకత్వం వహించనున్న ఈ సినిమా 2027లో రిలీజ్ చేస్తున్నట్టుగా తాను కన్ఫర్మ్ చేశారు. సో ఈ క్రేజీ సీక్వెల్ కోసం ఇంకో రెండేళ్లు ఆగాల్సిందే అని చెప్పాలి. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ తో పలకరించే విజయ్ ఆంటోనీ నుంచి ఇపుడు మార్గన్ అనే మరో థ్రిల్లర్ రేపు జూన్ 27న థియేటర్స్ లో పలకరించబోతుంది.