పోరాటాలు చేస్తున్న సునీల్ – నాగ చైతన్య

పోరాటాలు చేస్తున్న సునీల్ – నాగ చైతన్య

Published on Aug 7, 2012 10:10 PM IST


నాగ చైతన్య, సునీల్, హన్సిక మరియు ఆండ్రియా జెరేమియా ప్రాధాన పాత్రల్లో తెరకెక్కనున్న కొత్త తెలుగు సినిమా చిత్రీకరణ నిన్న హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్రం ఈ సంవత్సరం మొదట్లో తమిళంలో విడుదలై ఘన విజయం సాదించిన ‘వేట్టై’ చిత్రానికి రిమేక్. తమిళంలో ఈ చిత్రానికి తమిళంలో లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నాగ చైతన్య మరియు సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు . ఈ చిత్రంలో నాగ చైతన్యకి జంటగా హన్సిక మరియు సునీల్ కి ఆండ్రియా జెరేమియా జంటగా నటిస్తున్నారు. పి.కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గచ్చిబౌలి లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఈ చిత్రానికి సంబందించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘దడ’, ‘బెజవాడ’ మరియు ‘ఆటో నగర్ సూర్య’ చిత్రాల తర్వాత నాగ చైతన్య మళ్ళీ ఈ చిత్రంలో మాస్ హీరో పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2013 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు