బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రిషి కపూర్ నేడు తుది శ్వాస విడిచారు. నిన్న ఆయన అస్వస్థతకు గురి కావడంతో ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ హాస్పిటల్ లో చేర్చారు. గత రాత్రి వరకు నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం నేటి ఉదయం విషమించినట్లు తెలుస్తుంది. ఉదయం ఆయన ఆసుపత్రిలో కన్ను మూసినట్లు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి.
కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ అమెరికాలో చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫిబ్రవరి నెలలో ఆయన రెండు సార్లు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇక నిన్న నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఒక్కరోజు వ్యవధిలో మరో బాలీవుడ్ లెజెండ్ ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయారు.