జనవరి 24న రానున్న వేటాడు వెంటాడు

జనవరి 24న రానున్న వేటాడు వెంటాడు

Published on Jan 19, 2013 9:51 PM IST

Vishal-Trisha
విశాల్ మరియు త్రిష ప్రధాన పాత్రలలో రానున్న “వేటాడు వెంటాడు” చిత్రం జనవరి 24న విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రం విడుదల ఇప్పటికే రెండు సార్లు ధియేటర్లు దొరక్క వాయిదా పడింది. ఈ చిత్ర తమిళ వెర్షన్ జనవరి 13న విడుదల అయ్యి మంచి స్పందన దక్కించుకుంది. ట్రెక్కింగ్ గైడ్ గా విశాల్ కనిపించనున్నారు. సునైనా మరో కీలక పాత్ర పోషిస్తుంది. మనోజ్ బాజ్పాయ్ మరియు జె డి చక్రవర్తి ముఖ్య భూమికలు పోషించిన ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహించగా యువన్ శంకర్ రాజ సంగీతం అందించారు. విశాల్ త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించనున్నారు ఈ చిత్రాన్ని విశాల్ సోదరుడు విక్రం కృష్ణ నిర్మిస్తారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.

తాజా వార్తలు