ఈ నెల 17న రానున్న వేణు ‘రామాచారి’

Ramachari (14)

కామెడీ హీరో వేణు తొట్టెంపూడి నటించిన ‘రామాచారి’ సినిమా మే 17న విడుదలకానుంది. ఈ సినిమాలో వేణు సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని తమిళంలో సూపర్ హిట్ అయిన ‘సిఐడి’ ఆదారంగా నిర్మించారు. బ్రహ్మానందం, అలీ, ఎల్.బి శ్రీ రామ్, రఘుబాబు, గిరిబాబులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. చాలా కాలంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ వారం విడుదల కానుంది. ఈ సినిమా విజయంపై వేణు చాలా నమ్మకంగా వున్నాడు. ఈ సినిమాతో మరిసారి వేణు కెరీర్ ను కొత్తగా ప్రారంభించనున్నాడు.

Exit mobile version