పిచ్చేశ్వర్ గా కనిపించనున్న వెన్నెల కిషోర్

vennela-kishore
ప్రస్తుతం వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో బాగా బిజీ గా ఉన్న కమెడియన్. కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ తర్వాత ఆ స్థానాన్ని వెన్నెల కిషోర్ భర్తీ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఎన్నో మంచి పాత్రలు చేసిన వెన్నెల కిషోర్ అన్ని పాత్రలకి పూర్తి న్యాయం చేస్తున్నారు.

వెన్నెల కిషోర్ ప్రస్తుతం మంచు విష్ణుతో చేసిన ‘దూసుకెళ్తా’ విషయంలో చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో అతను చేసిన ఈ పాత్ర చాలా బాగా వచ్చిందని, అలాగే ఆ పాత్ర ప్రతి ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అంటున్నాడు. ఈ సినిమాలో అతని పాత్ర పేరు పిచ్చేశ్వర్. ఫుల్ ఎంటర్టైన్ చేసే పిచ్చేశ్వర్ అనే పాత్ర ఇచ్చినందుకు వీరు పోట్లకి వెన్నెల కిషోర్ థాంక్స్ చెప్పాడు.

లావణ్య త్రిపతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించాడు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version