వెంకటేష్ పుట్టిన రోజు కానుక

వెంకటేష్ పుట్టిన రోజు కానుక

Published on Dec 7, 2012 7:30 PM IST

విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో విడుదల చేయాలని మొదట ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో షాడో షూటింగ్ కోసం వెంకటేష్ విదేశాలకు వెళ్ళడంతో ఆడియో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఆడియో విడుదల లేకపోవడంతో వెంకీ పుట్టిన రోజు కానుకగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రెండవ టీజర్ విడుదల చేయబోతున్నారు. ఈ వార్త అటు వెంకీ అభిమానుల్ని, ఇటు మహేష్ అభిమానుల్ని సంతోష పరిచింది. వెంకటేష్, మహేష్ బాబు సొంత అన్నదమ్ములు లాగా కలిసిపోయి సినిమాలో నటించారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాని విడుదల చేయబోతున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు.

తాజా వార్తలు