రెండవ షెడ్యుల్ కి సిద్ధమైన వెంకటేష్ ‘షాడో’

రెండవ షెడ్యుల్ కి సిద్ధమైన వెంకటేష్ ‘షాడో’

Published on Mar 6, 2012 9:04 AM IST


విక్టరీ వెంకటేష్ డాన్ పాత్రలో నటిస్తున్న ‘షాడో’ చిత్రం రెండవ షెడ్యుల్ కి సిద్ధమైంది. ఈ నెల 7 నుండి ఈ చిత్రానికి సంభందించిన రెండవ షెడ్యుల్ ప్రారంభం కానుంది. వెంకటేష్ డాన్ పాత్రలో కొత్త లుక్ తో కనిపిస్తున్న చిత్రం స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నట్లు చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ చెబుతున్నారు. ప్రముఖ స్క్రిప్ట్ రచయితలు కోన వెంకట్ మరియు గోపి మోహన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ మరియు డైలాగులు అందిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడీగా తాప్సీ నటిస్తుండగా శ్రీకాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. మరో హీరొయిన్ గా మధురిమ నటిస్తుంది. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న షాడో చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు ఆస్ట్రేలియా మరియు ముంబై నగరాల్లో చిత్రీకరించనున్నారు.

తాజా వార్తలు