విక్టరీ వెంకటేష్ మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుగుతుంది. ఇటీవలే మహేష్ బాబు, సమంతా లపై సిటీ సెంట్రల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మహేష్ బాబుకి అన్నగా వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమా పై ఇద్దరు హీరోల అభిమానులే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన మొదటి చిత్రం ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో హిట్ కొట్టి అందరి చూపు తనవైపు తిప్పుకున్న శ్రీకాంత్ అద్దాల డైరెక్షన్లో వస్తున్న రెండవ చిత్రం ఇది. మిక్కీ జే మేయర్ సంగీత అందిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పర్సనల్ టూర్ మీద సింగపూర్ వెళ్ళాడు.