ఫ్యాన్సీ ఆఫర్ పొందిన వెంకి – రామ్ ‘గోల్ మాల్’ సినిమా

venky-ram
విక్టరీ వెంకటేష్, ఎనేర్జిటిక్ హీరో రామ్ కలిసి నటిస్తున్న సినిమా ‘గోల్ మాల్’. ఈ సినిమాని బాలీవుడ్ ‘బోల్ బచ్చన్’ సినిమాకి రీమేక్ గా నిర్మిస్తున్నారు. ఎటువంటి అడ్డాకులు లేకపోతే ఈ సినిమాని దసరాకి విడుదలనుకుంటున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ సినిమా తరువాత తెలుగులో వస్తున్న రెండవ మల్టీ స్టారర్ సినిమా ఇది. రిజల్ట్ ను బట్టి చుస్తే ఈ సినిమా మంచి బిజినెస్ ని చేయనుందనిపిస్తుంది. మేము విన్న సమాచారం ప్రకారం నిర్మాతలకు నెల్లూరు నుండి రూ.1. 35 కోట్లు బిజినెస్ ఆఫార్ ఈ సినిమా కోసం వచ్చినట్లు తెలిసింది. ఇది చాలా ఎక్కువని అందరు అనుకుంటున్నారు. అంజలి, షాజాహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా స్రవంతి రవికిషోర్, డి. సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు.

Exit mobile version