అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”

mirai-machu

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ విజువల్ వండర్ చిత్రమే “మిరాయ్”. భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక అదే రీతిలో వసూళ్లు కూడా కొల్లగొట్టింది. తెలుగు స్టేట్స్ లోనే కాకుండా హిందీ సహా యూఎస్ మార్కెట్ లో కూడా మిరాయ్ భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.

ఇలా నార్త్ అమెరికాలో మిరాయ్ సాలిడ్ వసూళ్ల మార్క్ 1.8 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని అందుకొని అదరగొట్టి ఇక నెక్స్ట్ స్టాప్ గా 2 మిలియన్ క్లబ్ లో చేరేందుకు సిద్ధం అయ్యింది. దీనితో మిరాయ్ స్ట్రాంగ్ హోల్డ్ తో దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version