కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అవుతున్న ప్రజల ప్రధాన కాలక్షేపంగా టెలివిజన్ తయారైంది. ఈ నేపథ్యంలో ఈ సందర్భాని క్యాష్ చేసుకొనే పనిలో టెలివిజన్ చానెల్స్ ఉన్నాయి. ఆసక్తికర సినిమాలతో పాటు, గతంలో మంచి విజయం సాధించిన కార్యక్రమాలను పునఃప్రసారం చేస్తున్నారు. కాగా వచ్చే సోమవారం నుండి ఈ టీవీలో వెంకటేష్ మూవీ ఫెస్టివల్ ప్రారంభం కానుంది.
సోమవారం నుండి వరుసగా సాయంత్రం 7 గంటలకు వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ కొన్నిటిని ప్రసారం చేయనున్నారు. మే 4న స్వర్ణ కమలం, మే 5న శత్రువు, మే 6న కొండపల్లి రాజా, మే 7న దేవిపుత్రుడు మే 8న సుందరకాండ, మే 9న సూర్యవంశం, మే 10న అబ్బాయిగారు ప్రసారం కానున్నాయి. వెంకీ అభిమానులకు ఇక పండగే అని చెప్పాలి.