విక్టరీ వెంకటేష్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు కలిసి నటిస్తున్నమల్టీ స్టారర్ చిత్రం ” సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు “, ఈ చిత్రం కోసం తెలుగు చలనచిత్ర రంగాన్ని అమితంగా ప్రేమించే ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారికి ఒక శుభవార్త ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రేపు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం ఎన్నడు లేనంతగా ఎదురు చూస్తున్నారని మహేష్ బాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. మహేష్ బాబు కి వీరాభిమని ఐన రాకేష్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం చాల ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మహేష్ బాబు మరియు వెంకటేష్ కలయిక తెర మీద చూడముచ్చటగా ఉంటుందని అన్నారు .
నాగార్జున రెడ్డి అనే వెంకటేష్ గారి అభిమాని వెంకటేష్ అభిమానులు కూడా సినిమా కోసం చాల ఎదురుచూస్తున్నారు అని చెప్పగా దానికి రాకేష్ గారు ‘ ఈ చిత్ర చిత్రీకరణలో వెంకటేష్ మరియు మహేష్ బాబు ఒకరినొకరు వారి నటన గురించి అభినందించుకున్నారు అని , వాళ్ళిద్దరిని ఒకే సారి తెర మీద చూడటం కోసం ఎదురుచూస్తున్నామన్నారు ‘. దశాబ్దం తర్వాత తెలుగులో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ” సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు “, ఈ చిత్రం విజయం సాదిస్తే ముందు ముందు ఇలాంటి కాంబినేషన్స్ లో చిత్రాలు రావడానికి ఆస్కారం ఉంటుంది.ఈ చిత్ర దర్శకుడు శ్రీ కాంత్ అడ్డాల ఎలా తీసారు అనే దాని కోసం రేపటి వరకు వేచి చూడాలి.