మార్చిలో ‘షాడో’

మార్చిలో ‘షాడో’

Published on Feb 6, 2013 8:02 AM IST

shadow

విక్టరీ వెంకటేష్ యాక్షన్ ఎంటర్టైనర్ షాడో మర్చి నెలాఖరుకు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మెహెర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నాడు. వెంకటేష్ కి జోడీగా తాప్సీ నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రా పోషిస్తున్నాడు. వెంకటేష్ తండ్రిగా నాగేంద్ర బాబు నటిస్తుండగా తన తండ్రిని మోసం చేసి చంపిన వారిపై కొడుకు ఎలా పగ తీర్చుకున్నాడు అనేది చిత్ర మూల కథ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడు. కోన వెంకట్, గోపి మోహన్ స్క్రిప్ట్ అందించిన షాడో మెహెర్ రమేష్ కి చాలా ఇంపార్టెంట్. వరుస పరాజయాలతో సతమవుతున్న ఆయనకు విజయం చాలా అవసరం.

తాజా వార్తలు