వెంకటేష్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడా?

venki_maruthi
విక్టరీ వెంకటేష్ మారుతి డైరెక్షన్ లో చేయనున్న ఓ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకి ‘రాధ’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపిక చివరి దశకు చేరుకుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ రాజకీయ నాయకుడిగా హోం మినిస్టర్ పాత్రలో కనిపించనున్నాడు. వెంకటేష్ తన 27 సంవత్సరాల కెరీర్లో ఇలా పొలిటీషియన్ అవతారంలో కనిపించడం ఇదే మొదటి సారి. ఈ సినిమాకి ‘ది హోం మినిస్టర్ హానరబుల్ లవ్’ అనే ఉపశీర్షిక ని పరిశీలిస్తున్నారు.

ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి వెంకటేష్ ని సరికొత్తగా చూపించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. డివివి దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి
సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.

Exit mobile version