కన్నడలో రీ-మేడ్ అవ్వనున్న వెంకటేష్ బాబు సినిమా

కన్నడలో రీ-మేడ్ అవ్వనున్న వెంకటేష్ బాబు సినిమా

Published on May 30, 2013 9:00 PM IST

Lakshmi
మరో తెలుగు సినిమా కన్నడలో రీమేడ్ అవ్వనుంది. ఇటీవల కొందరు నిర్మాతలు ‘బృందావనం’, ‘కాంచన’ సినిమాలకు రీమేక్ హక్కులను పొందారు. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్, నయనతార కలిసి నటించిన ‘లక్ష్మి’ సినిమాను కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించనున్నాడు. ఇది ఉపేంద్ర యొక్క 99వ చిత్రం. ఈ సినిమాకు ‘గౌరీ’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. సాయి ప్రకాష్ దర్శకుడు. ఈ సినిమాలో ఇంకా హీరొయిన్స్ ను ఖారారు చెయ్యవలసివుంది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో మొదలుకావచ్చు.

ప్రస్తుతం వెంకటేష్, రామ్ తమ తదుపరి సినిమా ‘గోల్ మాల్’ సినిమా షూటింగ్లో బిజీగా వున్నారు. అంజలి, షాజన్ పదాంసీ హీరోయిన్స్. కె. విజయభాస్కర్ దర్శకుడు. స్రవంతి రవి కిషోర్-సురేష్ బాబు నిర్మాత. ఈ సినిమా ‘బోల్ బచ్చన్’కు రీమేక్. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది.

తాజా వార్తలు