మెహెర్ రమేష్ రానున్న చిత్రం “షాడో”లో వినూత్న అవతారంతో వెంకటేష్ అభిమానులను అలరించబోతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని చుసిన వారంతా ఈ చిత్రం గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు , “వెంకటేష్ “షాడో” చిత్ర ట్రైలర్ చూసాను చాలా బాగుంది కొద్ది రోజుల్లో మీ ముందుకి వస్తుంది” అని గోపి మోహన్ అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. తాప్సీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. మెహెర్ రమేష్ ఈ చిత్రం గురించి చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు వెంకటేష్ కెరీర్ లో ఇది అత్యంత స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మారబోతుందని సమాచారం. శ్రీకాంత్,మధురిమ మరియు బెనర్జీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం జనవరి 2013లో విడుదల కానుంది.