మళ్లీ పవన్ కళ్యాణ్ మేనియా.. ‘ఓజి’తో జానీ డేస్ వెనక్కి

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన డ్రెస్సింగ్ స్టైల్ అయితే తెలుగు రాష్ట్రాల యువతని అప్పట్లో ఊపేసింది.ఖుషి, జానీ, బాలు లాంటి సినిమాల్లో కార్గో జీన్స్, హూడీస్ ఇంకా మరెన్నో యూనిక్ అంశాలతో పవన్ ట్రెండ్ సెట్ చేశారు.

ఇది అత్తారింటికి దారేది కి కూడా రిపీట్ అయ్యింది. అయితే మళ్లీ ఈ రోజులు అన్నీ తన లేటెస్ట్ సినిమా ఓజి తో వెనక్కి వచ్చాయని చెప్పాలి. ఓజి మేకర్స్ స్పెషల్ మెర్చండైజ్ ని అనౌన్స్ చేయగా వీటికి రెస్పాన్స్ షాకింగ్ గా వచ్చింది. పెట్టిన స్టాక్ అంతా చాలా తక్కువ వ్యవధి లోనే అయ్యిపోయింది.

దీనితో మార్కెట్ లో ఓజి క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో పవన్ అభిమానులు మళ్లీ ఆ పాత రోజులు ఓజి సినిమా అందించింది అని చిత్ర యూనిట్ కి దర్శకుడు సుజిత్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.

Exit mobile version