యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న వెంకటేష్ – రామ్

venkatesh-and-ram

బాలీవుడ్ రీమేక్ ‘బోల్ బచ్చన్’ లో విక్టరీ వెంకటేష్ – యంగ్ హీరో రామ్ హీరోలుగా కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన కొన్ని ఫైట్ సీక్వెన్స్ లో ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ లో సినిమాలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ‘గోల్ మాల్’ అనే టైటిల్ పెట్టిన ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనజలి షాజన్ పదంసీ హీరోయిన్ గా నటిస్తోంది. డి. సురేష్ బాబు – స్రవంతి రవికిషోర్ లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ మొదలు పెట్టిన వెంకటేష్ చేస్తున్న రెండవ మల్టీ స్టారర్ మూవీ ‘గోల్ మాల్’

Exit mobile version