‘నారప్ప’ కూడా ముగించుకుని వచ్చాడు !

‘నారప్ప’ కూడా ముగించుకుని వచ్చాడు !

Published on Mar 18, 2020 12:19 PM IST

విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవ‌ల త‌మిళ‌నాడు తిరుచందూర్ తెరికాడులోని రెడ్ డెసర్ట్ ప్రాంతంలో మొదలైన సంగతి తెలిసిందే. కాగా అక్కడ కొన్ని యాక్ష‌న్ సీన్స్ ను చిత్రీక‌రించారు. నిన్న ఈ సినిమా షెడ్యూల్ ను పూర్తి చేసి ప్యాకప్ చెప్పారు. ప్రస్తుతం యూనిట్ మొత్తం హైద‌రాబాద్ చేరుకుందట. ఇక క‌రోనా వైర‌స్ ప్రభావం పూర్తిగా తగ్గాకే నారప్ప తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు.

కాగా ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రెండవ హీరోయిన్ పాత్రలో మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది. కాగా త‌మిళ‌నాడులో జరిగిన షెడ్యూల్ లో ఆమె కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ అండ్ ఆమె పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారట. మాస్‌ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్‌ప్రైజ్‌ చేశారు విక్టరీ వెంకటేష్‌. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్.

తాజా వార్తలు