ఛాలెంజ్ ఓకే.. గ్యాంగ్ లీడర్ కోసం వెయిటింగ్ !

ఛాలెంజ్ ఓకే.. గ్యాంగ్ లీడర్ కోసం వెయిటింగ్ !

Published on Apr 22, 2020 5:39 PM IST

యంగ్ ఎన్టీఆర్ ‘బీ ద రియల్‌ మెన్‌’ ఛాలెంజ్ ను చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్యలతో పాటు కొరటాల శివకి కూడా ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసింది. కాగా తాజాగా విక్టరీ వెంకటేష్, ఎన్టీఆర్ ఛాలెంజ్ ను అంగీకరించినట్లు తన శైలి మ్యానరిజమ్ కి సంబంధించి వీడియోను పోస్ట్ చేసి వినూత్నంగా తారక్ ఛాలెంజ్ ను వెంకటేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకీ, మెగాస్టార్ గురించి పోస్ట్ చేస్తూ.. ‘మన గ్యాంగ్ లీడర్ వీడియో కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని వెంకీ పోస్ట్ చేశారు.

మొత్తానికి కరోనా లాక్ డౌన్ లో అందరూ ఇంటికే పరిమితమైపోవడంతో ‘బీ ద రియల్‌ మెన్‌’ పేరుతో సినీ ప్రముఖులంతా తమలోని ఫ్యామిలీ మెంబర్ కోణాన్ని ప్రదర్శిస్తూ.. ఇంటి పని, వంట పని చేస్తూ తమ తోటి స్టార్స్ చేత కూడా చేయించడం ఫ్యాన్స్ కు బాగా ఆసక్తిని కలిగిస్తోంది. డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా ‘బీ ద రియల్‌ మెన్‌’ పేరుతో మొదలెట్టిన ఈ ఛాలెంజ్.. రాజమౌళి పుణ్యమా అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం ఇప్పుడు వారి వల్ల ఈ ఛాలెంజ్‌ మిగతా ఇండస్ట్రీస్ కి కూడా చేరింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు