భావోద్వేగానికి గురైన వెంకటేష్ – మహేష్ బాబు

భావోద్వేగానికి గురైన వెంకటేష్ – మహేష్ బాబు

Published on Jan 22, 2013 12:50 AM IST

SVSC-Triple-Platinum-DisC-(
టాలీవుడ్ స్టార్ హీరోలైన విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి అన్నదమ్ముల అనుబందాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. వారిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ రియల్ లైఫ్ లో ఇద్దరు అన్నదమ్ములు ఎలా ఉంటారో అంత సహజంగా ఉంది. ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ వేడుక నిన్న జరిగింది. ఈ వేడుకలో వెంకటేష్, మహేష్ బాబులు మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.

విక్టరీ వెంకటేష్ మహేష్ బాబు నా చిన్న తమ్ముడని అన్నారు. ‘ రియల్ లైఫ్ లో నాకు అన్నయ్య ఉన్నారు. కానీ నాకు చిన్న తమ్ముడు ఎవరూ లేరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో నాకొక తమ్ముడు దొరికాడని’ వెంకటేష్ అన్నారు. అలా అని వెంకటేష్ మహేష్ బాబుని కౌగలించుకున్నారు.

అదే భావోద్వేగానికి లోనైన మహేష్ బాబు మాట్లాడుతూ ‘ ముందుగా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు సినిమా ఆడియన్స్ కి ధన్యవాదాలు. అలాగే మా అన్నయ్య వెంకటేష్ గారితో కలిసి పనిచేయడం ఎప్పటికీ మరిచి పోలేను. ఇకనుంచి ఆయనతో కలిసి పనిచేయడం మిస్ అవుతున్నానని’ అన్నారు. ఈ సినిమా అన్ని ఎరియాల్లోనూ బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

తాజా వార్తలు