నేను, అన్నయ్య నిజంగా కూడా అలానే ఉంటాము – వెంకటేష్

నేను, అన్నయ్య నిజంగా కూడా అలానే ఉంటాము – వెంకటేష్

Published on Jan 19, 2013 11:30 PM IST

Venkatesh
ఫ్యామిలి ఆడియన్స్ కంటూ సెపరేట్ గా ఒక హీరో ఉన్నారంటే అది వెంకటేష్ మాత్రమే ఇటు క్లాసు ఆడియన్స్ ని ఫ్యామిలి చిత్రాలతో ఆకట్టుకుంటూనే మరో చేత్తో మాస్ చిత్రాలను చేస్తున్నారు. తాజాగా ఈ నటుడు మహేష్ బాబు తో కలిసి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ చిత్రంలో వెంకటేష్ మరియు మహేష్ బాబు అన్నదమ్ముల పాత్రలో కనిపించారు.ఈ చిత్రం ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం గురించి ఒకానొక ప్రముఖ దిన పత్రికతో మాట్లాడుతూ వెంకటేష్ ఇలా అన్నారు ” మా ఇంట్లో నాన్న గారు కూడా పెద్దోడా చిన్నోడా అని పిలుస్తుంటారు. నేను చేసింది మా అన్నయ్య పాత్ర ఈ చిత్రంలో నేను మహేష్ బాబు ఎలా అయితే మాట్లాడుకున్నామో నిజంగా నేను అన్నయ అలానే మాట్లాడుకుంటాము” అని అన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వెంకటేష్ “షాడో” చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రం వేసవికి ప్రేక్షకుల ముందుకి రానుంది. రామ్ మరియు వెంకటేష్ కలిసి “బోల్ బచ్చన్” రీమేక్లో నటించనున్నారు.

తాజా వార్తలు