భారీ విడుదలకు సిద్ధమవుతున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్స్

venkatadri-express

సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్స్’ ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ కినేమా ఇప్పటికే సెన్సార్ ను ముగించుకుని ‘యు’ సర్టిఫికేట్ సంపాదించుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకులనుండి, సినీ వర్గాలనుండి మంచి స్పందన వచ్చిందని చిత్ర బృందం తెలిపారు

ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు. ఎప్పుడూ కష్టాలు పడకుండా జీవించాలి అని అనుకునే యువకుని జీవితంలో కలిగిన మార్పులను ఈ సినిమాలో చూపించారు. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై కిరణ్ ఈ చిత్రానికి నిర్మాత. సందీప్ కిషన్ సరసన రాకుల్ ప్రతీక్ సింగ్ నటిస్తుంది. ఛోటా కె నాయుడు అందించిన సినిమాటోగ్రాఫి సినిమాకే ప్రధానఆకర్షణగా నిలవనుంది. రమణగోగుల సంగీత దర్శకుడు.

Exit mobile version