గత శుక్రవారం విడుదలైన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా విడుదలైన అన్ని చోట్లా మంచి టాక్ ని సొంతం చేసుకొని సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి డైరెక్టర్. ఇతనికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ అందరి నుండి ప్రశంశలను అందుకున్నాడు. అన్ని చోట్ల నుండి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకి కలెక్షన్స్ ఫుల్ గా వస్తున్నాయి.
ఈ సినిమాని అనుకున్న బడ్జెట్ లో కంట్రోల్ గా తీయడం వల్ల అటు నిర్మాతకి, ఇటు డిస్ట్రిబ్యూటర్ లకి మంచి లాభాలు వస్తున్నాయి. జెమిని కిరణ్ నిర్మించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, రాకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాతో సందీప్ కిషన్ సోలో హీరోగా తొలి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు. రమణ గోగుల మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.