నవంబర్ 29న రిలీజ్ అయిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా సందీప్ కిషన్ కి సోలో హీరోగా మొదటి హిట్ ని ఇచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వారు సినిమాకి లాభాలు వస్తుండడంతో చాలా ఆనందంగా ఉన్నారు. ‘ఈ సినిమాని కంట్రోల్ గా తక్కువ బడ్జెట్ లో చేసారు. అలాగే అందరికి ఆమోదయోగ్యమైన ధరకే అమ్మారు. అందువల్ల ఈ సినిమాకి రెవిన్యూ బాగా వస్తోందని’ విజయవాడకి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు.
సందీప్ కిషన్ – రాకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమా ద్వారా మేర్లపాక గాంధీ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమిని కిరణ్ నిర్మించిన ఈ సినిమాకి రమణ గోగుల డైరెక్టర్.