విడుదల తేదీ : ఏప్రిల్ 20, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : బాలాదిత్య, లతా రెడ్డి, బేబీ జైత్ర వరేణ్య తదితరులు.
దర్శకుడు : వేగేశ్న సతీష్
నిర్మాణం: వేగేశ్న సతీష్
సంగీతం : ఎస్ కె బాల చంద్రన్
సినిమాటోగ్రఫీ : దాము నర్రావుల
ఎడిటర్ : మధు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు కొనసాగిస్తున్న లఘు చిత్రాల వీక్లీ సిరీస్ లో రీసెంట్ గా వచ్చిన మరో లఘు చిత్రమే ‘వెండి పట్టీలు’. శతమానం భవతి దర్శకుడు వేగేశ్న సతీష్ నుంచి వచ్చిన మరో లఘు చిత్రం ఇది కాగా ఇదెలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఒక సాధారణ రైతు అయినటువంటి వీరబాబు (బాలాదిత్య) తన భార్య సీత (లతా రెడ్డి) కూతురు బుజ్జమ్మ (బేబీ జైత్ర వరేణ్య) లతో సింపుల్ జీవితాన్ని ఓ పల్లెటూరులో సాగిస్తాడు. అయితే తన చిట్టి కూతురుకి తన స్నేహితురాళ్ళతో ఆటాడుకుంటున్నపుడు ఎందుకో తన స్నేహితురాలి పట్టీలు చూసి ఆశపడుతుంది. తన స్నేహితురాలు ఓసారి అడిగితే ఇవ్వకపోయేసరికి తన నాన్నని ఆ చిట్టి కోరిక కోరుతుంది. మరి ఈసారి చేతికొచ్చిన పంట అమ్మాక వచ్చే డబ్బులతో కొంటాను అని మాట కూడా ఇస్తాడు. మరో పక్క తాను కౌలు డబ్బులు కూడా కట్టాల్సి ఉంటుంది. మరి తన కూతురు కోరిన కోరికను తాను నెరవేర్చడా లేదా? తన చేతి వరకు వచ్చిన వరి పంటకు ఏమయ్యింది? వెండి పట్టీలు కోసం ఈ భార్యాభర్తలు ఏం చేశారు అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఇది వరకే ఈటీవీ విన్ లో ప్రసారం అయ్యిన ఇదే వీక్లీ సిరీస్ లో వేగేశ్న సతీష్ నుంచి మరో మంచి అటెంప్ట్ నే ఈ వెండి పట్టీలు అని చెప్పవచ్చు. దీనికి ముందు వచ్చిన ‘ఉత్తరం’తో పాత జ్ఞాపకాలు ప్రస్తుతం తరానికి బ్యూటిఫుల్ ఎమోషన్స్ ని తాను అందించారు.
మరి ఇలానే ఈ వెండి పట్టీలు కూడా మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. సింపుల్ కథా నేపథ్యంతో అందులో మంచి ఎమోషన్స్ ని బ్యూటిఫుల్ డైలాగ్స్ ని తాను అందించారు. నటీనటులు ముగ్గురూ బాలాదిత్య, లతా రెడ్డి అలాగే బేబీ జైత్ర వరేణ్యలు చాలా చక్కగా నాచురల్ పెర్ఫామెన్స్ లని అందించారు.
మెయిన్ గా బాలాదిత్య, బేబీ జైత్ర వరేణ్య నడుమ కొన్ని సీన్స్ అలాగే తనకి తన భార్య నడుమ కొన్ని సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ కావచ్చు. అలాగే మధ్య తరగతి కుటుంబీకులకు అర్ధం చేసుకునే భార్యా భర్తలకు ఈ లఘు చిత్రం ఇంకా హత్తుకోవచ్చు.
మైనస్ పాయింట్స్:
గత లఘు చిత్రం లానే ఈసారి కూడా కథనం సమస్య ఉంది. స్లోగా సాగే కథనం ఇది షార్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కొంచెం సాగదీతగా అనిపిస్తుంది. సో ఓటిటిలో 1.25ఎక్స్ లో పెట్టుకొని ట్రై చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీనిని ఎడిటింగ్ లో సరి చేయాల్సింది. అలాగే చిన్న లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి. కూతురు వెండి పట్టీలు కోసం అంతకంటే ఖరీదైన వస్తువునే అమ్మేసారు కానీ ఇక్కడ ఇంకొంచెం జస్టిఫికేషన్ చేసి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం:
వేగేశ్న సతీష్ దర్శకత్వం కోసం పైన చెప్పినట్టుగానే బ్యూటిఫుల్ వర్క్ ని తాను అందించారు కానీ ఇంకొంచెం కథనంపై దృష్టి పెట్టాల్సింది. అలాగే తన నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. పల్లెటూరు నేపథ్యం, విజువల్స్, సంగీతం ఆకర్షణగా నిలిచాయి అని చెప్పవచ్చు. డైలాగ్స్, మేకప్, కాస్ట్యూమ్ వర్క్ లు సహజంగా కనిపించాయి.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “వెండి పట్టీలు” దర్శకుడు వేగేశ్న సతీష్ నుంచి మరో డీసెంట్ ప్రయత్నం అని చెప్పవచ్చు. ప్రధాన నటీనటులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు. మంచి ఎమోషన్స్ తో ఈ లఘు చిత్రం బాగానే ఉంది. చిన్న లాజికల్ మిస్టేక్స్ పక్కన పెడితే ఫ్యామిలీతో ఈటీవీ విన్ లో తప్పకుండా ప్రయత్నించవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team