‘ది గర్ల్‌ఫ్రెండ్’ యూఎస్ లేటెస్ట్ కలెక్షన్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి టాక్ లభిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు ఓవర్సీస్‌లో మంచి రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా పెరుగుతోంది. ఈ సినిమాకు తాజాగా 175K డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు.

దీంతో ఈ కలెక్షన్స్ వీకెండ్‌లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని.. ఈ సినిమాతో రష్మిక సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రజెంట్ చేశారు.

Exit mobile version