తండ్రైన డైరెక్టర్ వీరూ పోట్ల

Veeru-Potla
‘బిందాస్’, ‘రగడ’ లాంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన వీరూ పోట్లకి ఒక బ్యూటిఫుల్ బేబీ జన్మించడంతో తండ్రయ్యాడు. ఈ వార్తని మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ‘వీరూ పోట్లకి ఒక బుజ్జి పాత పుట్టడంతో తండ్రయ్యాడు. మీ ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని’ మనోజ్ ట్వీట్ చేసాడు.

వీరూ పోట్ల మంచు విష్ణు హీరోగా దూసుకెళ్తా సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్టోబర్ 17న భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు బాగా డీల్ చెయ్యగలడని వీరూ పోట్ల కి మంచి పేరుంది, అదే తరహాలోనే ఈ మూవీ ఉంటుందని ఆశిస్తున్నారు.

ఈ సందర్భంగా వీరూ పోట్లకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..

Exit mobile version