‘అహ నా పెళ్ళంట’, ‘పులారంగడు’ సినిమాలను తీసి రెండు వరుస హిట్లను అందుకున్న దర్శకుడు వీరభద్రమ్. ప్రస్తుతం ఈయన నాగార్జునతో ‘భాయ్’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. వీరభద్రమ్ తన మార్కు కామెడీలతో సినిమాలను తీసి తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు. ఫిలిం నగర్ కధనాల ప్రకారం ఇప్పుడు మన దర్శకుడు నిర్మాత బండ్ల గణేష్ తో కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ చెయ్యనున్నాడు
బండ్ల గణేష్ ఈ సినిమా కోసం ఒక పెద్ద హీరోను సంప్రదించే పనిలో వున్నాడు. ఈ వార్త ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు
వీరభద్రమ్ ‘భాయ్’ ఆగష్టు చివరి వారంలో విడుదలకానుంది. ఈ సినిమాగానుక విజయం సాధిస్తే బండ్ల గణేష్ ప్రాజెక్ట్ కారణంగా ఈ యువ దర్శకుడు పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోతాడు.