యూరప్ వెళ్లనున్న వస్తా నీ వెనుక టీం

యూరప్ వెళ్లనున్న వస్తా నీ వెనుక టీం

Published on Jan 8, 2014 7:00 PM IST

Vastha-Nee-Venuka
నువ్విలా, జీనియస్ సినిమాలతో హీరోగా పరిచయమైన హవీష్ నటిస్తున్న కొత్త సినిమా ‘వస్తా నీ వెనుక’. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో అంతక ముందు ఆ తరువాత సినిమాతో పరిచయమైన ఈశ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఫిబ్రవరిలో యూరప్ వెళ్లనున్నారు. అక్కడే ఈ సినిమాకి సంబందించిన ఎక్కువ భాగం షూటింగ్ జరగనుంది. యూరప్ లో మొదటగా మారతాన్ లో ఈ సినిమా షూట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో ఈశ తో పాటు మరో హీరోయిన్ కూడా నటించనుంది. విజయ్ కె. చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి రామ్ – లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.

తాజా వార్తలు