అలెప్పీలో షూటింగ్ జరుపుకుంటున్న మెగా హీరో

varun-tej
కేరళ పరిసర ప్రాంతాలలో కొత్త మెగాహీరో వరుణ్ తేజ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకుడు. టాగూర్ మధు, నల్లమలపు బుజ్జి నిర్మాతలు. పూజా హేగ్దే హీరోయిన్. ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది

గతనెల కొచ్చిన్ లో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు అలెప్పీకి మారింది. “అలెప్పీ బీచ్ లు తన జీవితంలో చుసిన మంచి బీచ్ లని, చాలా శుభ్రంగా కూడా వున్నాయని” వరుణ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సినిమాలో గ్రామీణ నేపధ్యమున్న వాలీబాల్ క్రీడాకారుడిగా వరుణ్ కనిపించనున్నాడు

మిక్కి జె మేయర్ సంగీత దర్శకుడు. మనికందన్ సినిమాటోగ్రాఫర్. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు

Exit mobile version